నిర్వీష ( Kyllingia Monocephala) విషహరము
విషహర, విషహంత్రి అని సంస్కృతములోను, Kyllingia Monocephala Delphineun Denudatam అని ఆంగ్లములోను కలిగిన నిర్వీష ఒక విధమైన గడ్డి జాతికి చెందిన మొక్క. సాధారణముగా మెంతి మొక్కల ఆలకులను పోలి ఉంటుంది. హిమాలయ పర్వత ప్రాంతములలోను, మలయ పర్వత ప్రాంతములలోను, కాశ్మీర్ ప్రాంతంలోను విస్తారంగా పెరుగుతుంది.
ఈ విషహర మొక్కకు దుంప ఉంటుంది. ఈ దుంప అతివస దుంపను పోలి ఉంటుంది. కొన్ని దుంపలు నాభి కొమ్ములను పోలి ఉంటాయి. దుంప మిక్కిలి కఠినమైనది. దుంప కషాయముతో పాము, తేలు మొదలైన విషజంతువుల విషము హరిస్తుంది. వ్రణములను పోగొడుతుంది. శ్లేష్మ వాతములను బోచేస్తుంది.
