చర్మ వ్యాధులకు, మలేరియాకు మందు ‘నేలవేము’

ఈ నేలవేము మొక్క కాలేయాన్ని చురుకుగా పనిచేయిస్తుంది. మలేరియా నివారణకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధిని తగ్గించే గుణాలు ఈ మందులో ఉన్నాయి. ఈ మొక్క అన్ని రకాల జ్వరాలను తగ్గించగలదు. మొక్కను ఎండబెట్టి పొడిచేసి మిరియాల పొడితో కలిపి లోనికి తీసుకుంటే మలేరియా తగ్గుతుంది. పచ్చి ఆకులను వాముతో కలిపి తింటే జీర్ణ సంబంధ వ్యాధులు నయమవుతాయి. ఈ మొక్క ఆకులను ఇతర వనమూలికా రకాలైన నల్ల ఈశ్వరి మూలిక ఆకులతో సమపాళ్ళలో కలిపి తింటే బలానికి ఉపయోగపడుతుంది.
దీర్ఘకాలిక చికిత్సగా ఈ పద్ధతి చేపట్టాలి. ఆకుల రసాన్ని యాలకులు, లవంగాలతో కలిపి అజీర్ణం, గాస్టిక్ పెయిన్స్, నీళ్ళ విరేచనాలు వంటివి తగ్గించడానికి తీసుకోవచ్చు. మలేరియా వ్యాధి నివారణ కోసం ఈ మొక్కను ఉపయగించి చేసిన కిరాత అనే మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయి. వైరెస్ వ్యాధులకు మొక్కతో చేసిన టైప్రాలి అనే మందు వాడాలి. చర్మవ్యాధులకు చివత్రాది లేపనాన్ని వాడవచ్చు. ఈ మొక్కను ఆన్ డ్రోగ్రాఫిస్ పానిక్యులేటా( బర్మన్ ఫిలియన్) వాలికి ఎక్స్వీస్ అని శాస్ర్తీయనామంగా పిలుస్తారు. మొక్క అకాన్థేసి కుటుంబానికి చెందినది. ఈ మొక్కతో తిక్త కామృతం, గోరోచనాది గుళిక, చందనాసవం, పంచత్తిక కాషాయం వంటి ఆయుర్వేద మందులు తయారు చేస్తారు.
