ఆరోగ్యమే కాదు ఆయుర్వేదంలోనూ కొర్రలు అద్భుత ఔషధాలు

శరీరంలో వచ్చే వ్రణములు తగ్గుతాయి
కొంతమంది శరీరంలో పుండ్లతో చాలా బాధ అనుభవిస్తూ ఉంటారు. వీటిని పోగొట్టుకోవడానికి డాక్టర్లను సంప్రదిస్తూ ఉంటారు. దీనికి మంచి మందు కొర్రలు. ఈ కొర్రలను అన్నముగా వండి దానిలో గేదె పెరుగును కలిపి తినడం వల్ల చిరకాలము నుండీ బాధపెడుతున్న నాడీవ్రణములు తగ్గుతాయి. మరో పద్ధతి ప్రకారం కొర్ర మొక్కల వేళ్లను మెత్తగా నూరి ఆ చూర్ణమును గేదెపెరుగుతో కలిపి తిన్నా మంచి ఫలితం కనిపిస్తుంది.

