ఎంగిలీకము సకల దోషములకు హారి – Cinnabar

 

ఇంగిలీకము : హింగూలదరద అని సంస్కృతంలో పిలువబడే ఇంగిలీకము ను ఆంగ్లములో Cinnabar or Vemillion అని పిలుస్తారు. ఇది పాదరసముతో పూరింపబడిన ఒక ఘనపదార్ధము. దీని రంగు చిగురుటాకు వలె ఎర్రగా ఉంటుంది. దీనిలో రెండు రకములు కలవు. హంసపాకము, శుకతుండము. ఈ హంసపాకమునకే సూదులకట్టు ఇంగిలీకమని, వళందు ఇంగిలీకమని పేరు. రెండవది మామూలు ఇంగిలీకము. దీనిలో రస భాగము కొద్దిగా ఉంటుంది. సూదులకట్టు ఇంగిలీకము తెల్లని చారలు కలిగి సింధూరము వలె ఉంటుంది.

ఇంగిలీకము గుణములు

ఇంగిలీకము సకల దోషములను పోగొట్టే శక్తి కలిగి ఉంది. యోగవాహి, ఇది దేనిలో చేరితే దాని గుణము అధికమవుతుంది.  రసాయన ద్రవ్యము. మిక్కిలి వీర్యవృద్ధి కలిగిస్తుంది. ఇంగిలీకము నుంచి తీసిన రసమును వేడిచేస్తారు. ఇది తీపి వగరు రుచని కలగి ఉండి మూడు దోషములను హరిస్తుంది.

ఇంగిలీకము శుద్ధి ఎలా చేస్తారు?

ఇంగిలీకము అల్లపురసముతోను, నిమ్మకాయ రసము తోను ఏడుసార్లు భావన చేసి ఎండిపచేసినచో ఇంగిలీకము పరిశుద్ధి అవుతుంది.

ఇంగిలీకము ఉపయోగములు

  • ఇంగిలీకము సవాయి రోగములకు చాలా మంచిది.
  • కుష్ఠురోగములను హరిస్తుంది.
  • గొంతుకలోని శ్లేష్మమును కరిగించి చక్కగా విరేచనము చేస్తుంది.
  • తేనెతో కలిపి నూరి లింగమునకు లేపనము చేసినట్లయితే లేపన శక్తి పెరుగును.
  • హారతికర్పూరము, సాంబ్రాణి కలిపి నూరి ఆముదములో ఇంగిలీకముంచి దాన్ని వెలిగించి కాలిన వెనుక దీసి ఆ ముక్కను నిమ్మకాయలో పెట్టి శీలఇచ్చి లఘుపుటము వేసినట్లయితే కట్టును.
  • ఇంగిలీకము ముక్క మెత్తగా నూరి ఆముదములో రెండు నుంచి నాలుగు గురివిందగింజల ఎత్తు వరకూ ఇచ్చిన పైన వివరించిన రోగములన్నియు పోవును.
  • రక్తమును శుభ్రపరిచి వీర్యమును అభివృద్ధినొందించును.
  • 12బొమ్మచెముడు పండ్లతో కూడా ఇంగిలీకము కట్టును.
  • కామంచి ఆకులరసముతోను, మునగ పువ్వుల రసముతోను చురకా ఇచ్చినట్లయితే ఇంగిలీకము కట్టును.
  • అనుపాన విశేషముచే సకల రోగములను పోగొట్టే ఈ ఇంగిలీకము ఇంట్లోఉన్నట్లయితే పిల్లకు చింతామణి వలె పనిచేస్తుంది.

ఈ మందు ఏనుగుబలము నిస్తుంది. ఈ మందు సేవిస్తున్నంతకాలం పులుసు, నూనె, చేపలు తినకూడదు. ఈ ఒక్క వస్తువుతోనే వైద్యం చేసే ఆయుర్వేద వైద్యులు ఎందరో ఉండేవారు. దీని దోషానికి విరుగుడు సుగంధి కషాయము, ఫిరంగి చెక్క, చనుబాలు.

Similar Posts