ఊద బియ్యము: ఊదలు Barnyard Millet తో కలుగు ఎన్నో ప్రయోజనాలు

ఊదబియ్యాన్ని సంస్కృతంలో ఊంబీ అని పిలుస్తారు . పాలు కట్టిన లేత జొన్నకంకులు కోసి గడ్డి, తాటాకు మొదలైన వాటితో వేసిన సన్నని మంటలో దోరగా కాల్చి బట్టతో చుట్టి, జొన్న కర్రతోనే కొట్టినట్లయితే గింజలు బుట్టలో రాలుతాయి. అవి తీసుకుని పొట్టు ఊదివేసి తింటారు. వీటినే ఊద లేక ఊచ బియ్యము అంటారు. తియ్య తియ్యగా, కమ్మకమ్మగా ఉంటాయి. లఘుత్వము కలిగి ఉంటాయి. వాతము, పిత్తము హరిస్తాయి. బలము, పుష్టి చేస్తాయి. ఇవి అత్యంత పోషకమైన ధాన్యాలు. ఈ ధాన్యంతో అన్నం, ఇడ్లీ, ఉప్మా, దోసలు వంటి వంటకాలు చేసుకోవచ్చు.
ఊదలతో ఆరోగ్యం
- ఊదలలో అధిక మొత్తంలో ఫైబర్ మరియు ప్రోటీన్లు ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.
- ఊదలలో కేలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉండటం వల్ల ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
- షుగరు వ్యాధిని నివారించడంలో ఉపయోగపడతాయి.
- ఊదలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరగడానికి ఉపయోగపడతాయి.
- ఊదలలో ఉండే ఐరన్ మరియు కాల్షియం ఎముకల బలానికి మరియు రక్తహీనతను నివారించడానికి తోడ్పడతాయి.
