Recent Posts
‘కానుగ’తో చర్మవ్యాధులు నివారించ వచ్చు
ఫాబేసి కుటుంబానికి చెందిన కానుగ శాస్త్రీయనామం పొంగామియా పిన్నేటా పియరీ. ఇది 15 మీటర్లు ఎత్తువరకు పెరిగే వృక్షం. పత్రాలు సంయుక్తం. పత్రకాలు ఐదు నుంచి ఏడు ఉండి అండాకారంలో గాని, కోలగా కాని ఉంటాయి. పుష్పాలు చిన్నవిగా ఏర్పడతాయి. ఫలాలు ...
‘ఉల్లికాడ’ ల్లో సమృద్దిగా ఖనిజాలు
ఉల్లిచేసే మేలు తల్లికూడా చేయదని సామెత. నిజమే ఉల్లిపాయలకు అంత గొప్పదనం ఉంది. నిత్యజీవితంలో ఉల్లిపాయలను ఉపయోగించని వారండరంటే అతిశయెక్తి కాదు. అయితే కేవలం ఉల్లిపాయలే కాకు ఉల్లి కోళ్లు లేదా ఉల్లి కాడలుగా పిలుచుకునే ఉల్లిమొక్కలు కూడా మన ఆరోగ్యానికి ...
‘ఉల్లి’ చేసిన మేలు తల్లి కూడా చేయదు
సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడా ఇదే ప్రజాతికి చెందినది. ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతికి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. ఉల్లిపాయను సంస్కృతంలో పలాండు అని, హిందీలో ప్యాజ్ అని, ఇంగ్లీషులో ఆనియన్ ...
విషానికి విరుగుడు ‘ఉమ్మెత్త’
దతూర మెటల్ లిన్నెయస్ అనే శాస్త్రీయనామం కలిగిన ఉమ్మెత్త సొలనేసి కుటుంబానికి చెందినది. ఈ మొక్క ఇంచుమించు రెండుమీటర్ల ఎత్తువరకూ పెరిగే చిన్న పొద. కాండం, ఈనెలు ఊదారంగులో ఉంటాయి. పత్రాలు కణుపుకు ఒకటి చొప్పున దాదాపు అండాకారంలో ఉండి, అంచులకు ...
ఆయుర్వేదంలో ‘హరితమంజరి’ ఉపయోగాలు అద్భుతం
కంటికి ఎదురుగా కనిపిస్తూ పిచ్చిమొక్కలతో సమంగా పరిగణించే మొక్కలలో దివ్య ఔషధ గుణాలున్నాయంటే నమ్మశక్యం కాదు. ఇళ్ళ పెరట్లలోను, పొలాల గట్ల వెంబడి, బీడు భూముల్లోను అత్యధికంగా కనిపించేది, తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో హరితమంజరిగా పిలిచే ఈ మొక్క అనేక వ్యాధుల ...
మెమొరీ పవర్ పెంచడానికి దివ్యౌషధం ‘సరస్వతి ఆకు’
అపియేసి కుటుంబానికి చెందిన సరస్వతి ఆకు శాస్త్రీయనామం సిన్టెల్లా ఏసియాటికా(Centella asiatica)(లిన్నెయస్) అర్బన్. ఇది తేమ, నీరు ఉండే ప్రాంతాలలో నేలపై పాకుతూ పెరిగే బహువార్షిక మొక్క. ప్రతికణుపు నుండి వేర్లు, ఒక్కొక్క పత్రము ఏర్పడతాయి. పత్రాలు మూత్రపిండాకారంలో ఉంటాయి. అంచులకు ...
జీర్ణశక్తిని పెంపొందించే ‘సముద్రపాల’
కన్వాల్వులేసి కుటుంబానికి చెందిన సముద్రపాల శాస్త్రీయ నామం అర్జిరియా నెర్వోసా(Argyreia Nervosa)(బర్మన్ ఫిలియస్). ఇది ఇంచుమించు 15 మీటర్ల పొడవు పెరిగే బహువార్షికపు తీగ, శాఖోపశాఖలతో విస్తరిస్తుంది. మొక్క దేహమంతటా వెండి వంటి తెల్లని నూగుతో కప్పబడి ఉంటుంది. గిచ్చితే పాలు ...
తామర నిలవారణకు ‘రేల’ వైద్యం
సిసల్పినియేసి కుటుంబానికి చెందిన రేల శాస్త్రీయనామం కేసియా ఫిస్టులా(Cassia Fistula) లిన్నెయస్. ఇంచుమించు 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షము. పత్రాలు సంయుక్తం. కణుపుకు ఒక్కటి చొప్పున ఏర్పడతాయి. పత్రకాలు 3-8 జతలుంటాయి. పత్రాలు దళసరిగా, ముదురాకుపచ్చగా దీర్ఘ అండాకృతిలో ...
ఆయుర్వేద వైద్యంలో‘రేగుచెట్టు’ ఉపయోగాలెన్నో
Ziziphus Jujuba అనే శాస్త్రీయనామం కలిగిన రెగుచెట్టును సంస్కృతములో బదరీ, బదరము, గూఢఫలము, దృఢబీజము, వృత్తఫలము, కంటకి, వక్రకంటకము, కోల, కొలి, గృధసఖి అని కూడా పిలుస్తారు. సౌవీరబదరము, కోలబదరము, కర్కధూబదరము అని రేగుచెట్టు మూడు రకాలు. ఈ చెట్టు అంతా ...
కడుపులోని క్రిములను హరింపచేసే ‘మురిపిండ’
యఫర్బియేసి కుటుంబానికి చెందిన మురిపిండ శాస్త్రీయనామం అకాలిఫా(Acalypha Indica ఇండికా లిన్నేయస్ . ఈ మొక్క 30 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తువరకూ పెరుగుతుంది. ఇది ఏకవార్షిక మొక్క. పత్రాలు కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడతాయి. అడుగున ఉండే పత్రాలకు పొడవైన ...
జ్ఞాపకశక్తిని పెంచే ‘మాల్కంగిణి’
సెలాస్ట్రేసి కుటుంబానికి చెందిన మాల్కంగిణి శాస్త్రీయనామం సెలాస్ట్రస్ పానిక్యులాటస్(Celastrus Paniculatus) విల్డినో. ముండ్లు లేనటువంటి పెద్ద బహువార్షికపు పొద. కొమ్మలు 4 నుంచి 5 మీటర్ల పొడవు పెరిగి వ్రేళాడుతూ ఉంటాయి. పత్రాలు కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడి, అండాకారంలో ఉంటాయి ...
’మారేడు‘ లో అణువణువునా ఔషధ గుణాలే
రూటేసి కుటుంబానికి చెందిన మారేడు శాస్త్రీయనామం ఏగిల్ మర్మిలాస్(Aegle Marmelos) (లిన్నెయస్) కరియా. ఇది ఆరు నుంచి ఏడు మీటర్ల ఎత్తువరకూ పెరిగే ముళ్ళను కలిగిన వృక్షం. పత్రాలు త్రిద సంయుక్తం. పత్రకాలు ఇంచుమించు అండాకారంలో గాని దీర్ఘవృత్తాకారంలో గాని ఉంటాయి ...
ఆకలిని పెంచే ‘బొమ్మలమర్రి’
వెర్బినేసి కుటుంబానికి చెందిన బొమ్మలమర్రి క్లేరోడెండ్రమ్ సెర్రాటమ్(లిన్నేయస్) మాన్ అనే శాస్త్రీయనామం కలిగినది. ఇది రెండుమీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షికపు మొక్క. కాండం నలుపలకలుగా ఉంటుంది. పత్రాలు కణుపుకు రెండు లేదా మూడు చొప్పున ఏర్పడి కుంభకటకాకారంలో అంచులకు నొక్కులు ...
ఆయుర్వేదంలో ’బూరుగు చెట్టు‘ ప్రయోజనాలెన్నో
బంబకేసి కుటుంబానికి చెందిన బూరుగు శాస్త్రీయనామం బంబక్స్ సిబా(Bombax Ceiba) లిన్నెయస్. ఇది సుమారు 20 మీటర్ల ఎత్తు వరకూ పెరిగే వృక్షం. కాండంపై బొడిపెల వంటి ముండ్లుంటాయి. బెరడు ఎర్రగా ఉంటుంది. పత్రాలు కణుపుకు ఒకటి చొప్పున హస్తాకార సంయుక్తం ...
అతిమూత్ర వ్యాధికి విరుగుడు ‘పొడపత్రి’ చూర్ణం
ఆస్క్లిపియడేసి కుటుంబానికి చెందిన పొడపత్రి శాస్త్రీయనామం జిమ్నిమా సిల్వష్టర్(రిట్జియస్)(Gymnema Sylvestre) ఘల్ ట్జ్ . ఇది ఐదు నుంచి పది మీటర్ల వరకు పెరిగే బహువార్షికపు తీగ. పత్రాలు కణుపుకు రెండు చొప్పున దాదాపు అండాకారంలో ఉంటాయి. పత్రాలపై నూగు ఉంటుంది ...
అల్సర్ వ్యాధికి విరుగుడుగా ’పిల్లితీగలు‘
లిలియేసి కుటుంబానికి చెందిన పిల్లితీగలు శాస్త్రీయనామం ఆస్పరాగస్ రసిమోసస్ విల్డినో. అనేక శాఖలతో, ముళ్ళతో కూడిన బహువార్షికపు పొద. కండె ఆకారపు అనేక దుంప వేళ్ళు గుత్తులు గుత్తులుగా తయారవుతాయి. పత్రాలు చిన్న ముళ్ళ మాదిరిగా ఏర్పడతాయి. పత్రాల వంటి అనేక ...
‘నేలవేము’ లో అన్నీ ఔషధగుణాలే
అకాన్థేసి కుటుంబానికి చెందిన నేలవేము శాస్త్రీయనామం అన్ డ్రోగ్రాఫిస్ పానిక్యులేటా(బర్మన్ ఫిలియన్)(Andrographis Paniculata). ఈ మొక్క ఒక మీటరు ఎత్తు వరకూ పెరిగే ఏక-ద్వివార్షికపు మొక్క. అనేక శాఖలు ఏర్పడతాయి. శాఖలు, కాండం నలుపలకలుగా ఉంటాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ...
ఋతుక్రమం క్రమబద్ధీకరణకు ‘నేలతాడి’
అమరిల్లిడేసి కుటుంబానికి చెందిన నేలతాడి కర్కులిగో ఆర్కియాయిడిస్ గర్ట్నర్ అనే శాస్త్రీయనామం కలిగిన మొక్క. కాండం భూమిలోపలే పెరిగే చిన్న బహువార్షికపు మొక్క. దీనికి పొడవైన స్థూపాకారపు వేరు ఉంటుంది. పత్రాలు భూమినుండి వెలువడుతాయి. పత్రాలు నాలుగు నుంచి ఐదు ఉంటాయి ...
పాముకాటుకు విరుగుడుగా ’నల్లఈశ్వరి‘
అరిష్టలోకియేసి కుటుంబానికి చెందిన నల్ల ఈశ్వరి శాస్త్రీయనామం అరిష్టలోకియా ఇండియా లిన్నెయస్. ఇది ఐదు నుంచి ఆరు మీటర్ల పొడవు పెరిగే బహువార్షిక తీగ. నల్లఈశ్వరి మొక్కకు భూమిలో దుంపవంటి వేర్లుంటాయి. పత్రాలు కణుపుకు ఒకటి చొప్పున దీర్ఘచతురస్రాకారంలో, చివరిభాగంలో కొంచెం ...
జ్వరాల నివారణకు ‘చిరుబొద్ది’ చికిత్స
మెనిస్పెర్మసీ కుటుంబానికి చెందిన చిరుబొద్ది శాస్త్రీయనామం సిసంపిలస్ పరీరా లిన్నెయస్. ఇతర మొక్కలపై ప్రాకుతూ పెరిగే బహువార్షికపు తీగ. రెండు నుండి ఆరు మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. పత్రాలు కణుపుకు ఒక్కటి చొప్పున ఏర్పడి, వృత్తాకారంలో ఉంటాయి. వృంతాలు పొడవుగా ...




























